Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ కుర్రాడిది బ్రాడ్‌మన్ టెక్నిక్.. అతడిని ఔట్ చేయడం కష్టం: వైభవ్‌పై ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

Vaibhav Suryavanshi has Bradman technique and is hard to get out says Robin Uthappa
Advertisement
  • టీమిండియా యువ బ్యాటర్ సూర్యవంశీని డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చిన రాబిన్ ఊతప్ప
  • బ్రాడ్‌మన్‌లాగే వైభవ్‌ను కూడా ఎల్‌బీడ‌బ్ల్యూ ఔట్‌ చేయడం చాలా కష్టమని వ్యాఖ్య
  • బౌలర్లు అతడిపై ఎక్కువగా బాడీలైన్ బౌలింగ్ ప్రయోగిస్తున్నారని విశ్లేషణ
  • అధిక స్ట్రైక్‌రేట్‌తో ఇదే ఫామ్ కొనసాగిస్తే వైభవ్ ఒక 'అవుట్‌లయర్' అవుతాడని అభిప్రాయం
  • ధోనీలాగే తన సహజ శైలితో ఆడుతూ వైభవ్ ప్రత్యేకంగా నిలుస్తున్నాడని ప్రశంస
Advertisement
భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఓ యువ సంచలనం పేరు మారుమోగిపోతోంది. అతడే వైభవ్ సూర్యవంశీ. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన ఈ టీనేజ్ బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ విజేత రాబిన్ ఊతప్ప.. వైభవ్ బ్యాటింగ్ శైలిని ఏకంగా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌తో పోల్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ఊతప్ప, వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్‌లో బ్రాడ్‌మన్ ఛాయలు కనిపిస్తున్నాయని విశ్లేషించాడు. "బ్రాడ్‌మన్ ఆడుతున్నప్పుడు అతడిని కట్టడి చేసేందుకు బౌలర్లు బాడీలైన్ బౌలింగ్ ప్రయోగించేవారు. ఇప్పుడు వైభవ్ విషయంలోనూ అదే జరుగుతోంది. వీరిద్దరి టెక్నిక్‌లో ఒకేరకమైన పోలిక ఉంది. బ్రాడ్‌మన్‌లాగే వైభవ్‌ను కూడా ఎల్‌బీడ‌బ్ల్యూగా ఔట్ చేయడం దాదాపు అసాధ్యం" అని ఊతప్ప వివరించాడు. వైభవ్ కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, బౌలర్లు అతడిని ఎదుర్కోవడానికి ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నాడు.

అయితే, ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. "బౌలర్లు వైభవ్ బ్యాటింగ్‌కు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికి అతని ఆటతీరును అందరూ అర్థం చేసుకుంటున్నారు. వైభవ్ తన అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో పాటు 40లలో బ్యాటింగ్ సగటును కొనసాగించగలిగితే, అతడు కచ్చితంగా ఒక 'అవుట్‌లయర్' (సాధారణ పద్ధతులకు భిన్నంగా అద్భుతంగా రాణించే ఆటగాడు) అవుతాడు" అని అన్నారు. 

ఆధునిక క్రికెట్‌లో సాంప్రదాయ పద్ధతులకు భిన్నమైన ఆటగాళ్లు ఎక్కువగా రాణిస్తున్నారని ఊతప్ప తెలిపాడు. "ఇప్పుడు ఆటగాళ్లు సహజసిద్ధమైన ప్రతిభపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందుకే ఎంఎస్ ధోనీ తనదైన శైలితో విజయవంతమయ్యాడు. ఇప్పుడు వైభవ్ కూడా అదే చేస్తున్నాడు. భిన్నమైన టెక్నిక్‌లు ఇప్పుడు ఆమోదయోగ్యంగా మారాయి. అదే సమయంలో సచిన్ టెండూల్కర్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి వారి సంప్రదాయబద్ధమైన ఆటను కూడా మనం ఆస్వాదిస్తాం" అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
Advertisement
Advertisement
Vaibhav Suryavanshi
Robin Uthappa
Donald Bradman
Indian Cricket
Batting Technique
Cricket News

More Telugu News